
కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం ఆర్టీసి సంస్థను పీపీపీ విధానం ద్వారా ప్రయివేటు పరం చేయాలనుకోవడం దుర్మార్గం *ఎన్నో ఏళ్లుగా కన్నతల్లి లాగ వేలమందిని పోషించిన సంస్థను, కార్మికులను నాశనం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.కూటమి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల కక్షగట్టి ఆర్టీసీ కార్మికుల జీవితాన్ని నట్టేట ముంచే పిపిపి విధానాన్ని అమలు చేయడం కార్మికులను సర్వనాశనం చేయడమే. అవుతుంది.49 వేల మంది జీవితాలతో చెలగాటం ఆడుతు, సరైన నిర్వహణ చేయకుండా సంస్థ నష్టాలను కార్మికులపై నెట్టి ఆ నెపంతో, కొత్తగా విద్యుత్తు బస్సులను తెచ్చి ఆ బస్సు కాంట్రాక్తులను తన పార్టీ వారికీ అప్పగించి, దోపిడీ చేస్తూ ఆర్టిసిని మరింత నష్టాల్లోకి నెట్టడమే చంద్రబాబు విధానం.2004 లోకూడా చంద్రబాబు ఆర్టిసిని ప్రయివేట్ పరం చేసే ప్రయత్నం చేసాడు.బాబు పాలనలో కార్మికులు, రైతులు, ఉద్యోగులు, సమస్త ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు.ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ కలసి వ్యతిరేకించి ఉద్యమాల బాట పట్టి సమస్యలను పరిష్కరించుకోనే సమయం ఆసన్నమైనది.కూటమి ప్రభుత్వం ఆర్టిసినీ ప్రవేటు పరం చేసే విధానాన్ని స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నాను.అమానుల్లా. వైస్సార్సీపీ లీడర్ హిందూపూర్.