
సాక్షి డిజిటల్ న్యూస్ :14 జూలై 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు( రాము )అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండలం : జూలై 24 న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి నేడు స్ధానిక మొలకలచెరువు మండలంలోని సిపిఐ కార్యాలయం లో జిల్లా జనరల్ బాడీ సమావేశం కరపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణ ప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసుల ప్రకారం ప్రతి వ్యవసాయ కూలీకి దళిత గిరిజనులకు వెనుకబడిన తరగతుల పేదలకు ప్రతి కుటుంబానికి ఒక హెక్టారు భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కూలీలను స్వర్ణకారు చిన్న కారు రైతులను కరువు బారి నుండి ఆదుకోవాలని చేతినిండా పనులు కల్పించాలని వలసలు నివారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సమస్యలు పరిష్కరించడంలో వైపల్యం చెందాయని గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక జీవనం జరక్క పక్క రాష్ట్రాలకు వలసల తరుముతున్నారని వలసల నివారణ కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విస్తృతంగా ప్రతి ఒక్కరికి పని కల్పించి వలసల నివారించాలని ఆయన డిమాండ్ చేశారు అన్నమయ్య జిల్లాలో వ్యవసాయాన్ని కనుగొన్న ప్రభుత్వ మిగులు భూములు వ్యవసాయ కూలీలకు భూ పంపిణీ అసైన్మెంట్ కమిటీ ద్వారా చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అరాకుర భూ పంపిణీ జరిగిందని నాటి నుంచి నేటిదాకా గత 17 సంవత్సరాలుగా పేదలకు సెంటు భూమి పంపిణీ చేయలేదని ఇప్పటికైనా కోటమే ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ప్రభుత్వ నిధులు భూములు పంపిణీ చేయాలని చేయకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించి ఎర్రజెండాల పార్టీ పేదలకు తామే పంచుతామని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ నెల 24వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో జిల్లా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు యేసయ్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరావు గారు తదితరులు పాల్గొన్నారు ఈ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయడానికి వ్యవసాయ కూలీలు వందలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ములకలచెరువు మండల కార్యదర్శి కే అంజనప్ప, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రెడ్డప్ప, ఉత్తన్న,రామన్న, వేమనారాయణ,వెంకటరమణ, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు