
అమానుల్లా వైస్సార్సీపీ లీడర్ హిందూపూర్ =ఈ దారుణమైన దుర్మార్గమైన మరియు అన్యాయమైన ఈవీఎంల వ్యవస్థలో, అవినీతి అక్రమాలు మరియు అవకతవకలు రాజ్య మేలుతున్న నేటిరోజుల్లో, ఎన్నికల నిర్వహణ వ్యవస్థను మొత్తం ఈవీఎం మనువాద నాయకులు, తమ తోక పార్టీలకు, తమ చెప్పుచేతల్లో ఉండే పార్టీలకు మాత్రమే అనుకూలంగా మలుచుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో .. ఎలా బీసీ, యస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఎలా సాధ్యం అవుతుంది ఈవ్యవస్థతో ఎన్నికలు ఎదుర్కొంటే.. కనీసం నాయకత్వ స్థానాలలో ఉన్నవాళ్ళకైనా "డిపాజిట్" లు, లేదా గౌరవప్రదమైన ఓట్లుపడే పరిస్తితి ఉందా? మనం సభలు సమావేశాలు పెడితే వేల లక్షల మంది జనాలు హాజరు కావచ్చును గాక, ఆ వచ్చిన జనాలందరూ దాదాపుగా మనకే ఓట్లు వేస్తుండొచ్చు గాక, వేసిన ఓటు మనకు నమోదయ్యే పరిస్తితి లేనప్పుడు దేనిపై పోరాటం, యుద్ధం చేయాలి? ఆమాత్రం ఎన్నికల రాజకీయ స్పృహ అవగాహన అలోచన చైతన్యం సహా ముందుచూపు మరియు ఇంగితఙ్ఞానం లేకుంటే ఎలా? ఇలా ఎంతకాలం మన శక్తిని బలాన్ని పదేపదే రాజకీయ ప్రయోజనం లేకుండా, రాజకీయ శక్తిగా ఎదగకుండా, చక్రం తిప్పకుండా, రాజ్యాధికారం సాధించకుండా మరియు పాలక సమాజంగా మారకుండా.. పెద్దపెద్ద సభలు సమావేశాల తోతృప్తిపడదాం.. వాళ్ళతో వీళ్ళతో ఆహా ఓహో అనిపించుకుని స్వీయ సంతృప్తిపొందుదాం. మనకంటూ బలమైన స్థిరమైన ఎన్నికల వ్యూహాలు ఎత్తుగడలు మరియు పావులు కదిపే ఆలోచనలు అవసరం లేదా?. సాంప్రదాయ వారసత్వ కుటుంబ అవినీతి ఆధిపత్య పెత్తందారీ పెట్టుబడిదారి మనువాద పార్టీలు.. అవినీతిలో భాగమైన ఓటర్లకు వెదజల్లే విచ్చలవిడి డబ్బు మధ్యం బహుమతులు తాయిలాలు సహా ఇతర ప్రలోభాలు, అక్రమాల్లో భాగమైన దొంగ ఓట్లు రిగ్గింగ్ తో పాటు అవకతవకల్లో భాగమైన ఈవీఎం లాంటి కుట్రలు కుతంత్రాలు మరియు మోసాలు.. ఇంకా అడ్డదారుల్లో అక్రమపద్ధతుల్లో తప్పుడు మార్గంలో, అనైతిక మరియు అప్రజాస్వామిక పద్ధతుల్లో విధానంలో గెలిచే అనేక మార్గాలను ధీటుగా ధాటిగా సమర్థవంతంగా ఉద్యమ రూపంలో, పోరాట పంథాలో ఎదుర్కొనే ప్రణాళికలు మన వద్ద వుండాల్సిన అవసరం లేదా?.రెండు తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణ భారతదేశం మొత్తం.. నూటికి 90 శాతం పైబడి వుంటున్న మన సామాన్య పేద మధ్యతరగతి సహా అణగారిన బలహీన వర్గాలకు చెందిన నాయకత్వాలు.. ఆ దిశగా ఎందుకు ఆలోచించడంలేదు? ఎందుకు ఎన్నికల నిర్వహణ రాజకీయాలకు పదును పెట్టడం లేదు?. ఈ వ్యవస్థ మనకు అనుకూలంగా లేదని తెలిసినా, దానిలోని లొసుగులు లోపాలు తప్పులు సహా అందులోని అనేక అననుకూల అంశాలపై కలిసికట్టుగా ఐక్యంగా సమిష్టిగా మరియు సంఘటితంగా పోరాడలేకపోతున్నాం, ప్రజాస్వామ్య యుద్ధం చెయ్యలేకపోతున్నాం?. తెలుగు రాష్ట్రాలలో పార్టీలు పెట్టుకున్న ఏ ఒక్కరికైనా, కనీసం పార్టీ నాయకుడు పోటీచేసే స్థానంలోనైనా అన్ని పోలింగ్ బూతులలో మెజారిటీ పోలింగ్ బూతులలోనైనా బూతుకమిటీలు ఉన్నాయా? ఏ ఒక్కరైనా ధైర్యంగా గుండెలమీద చెయ్యివేసి చెప్పగలరా?. కాబట్టి ఇకనైనా ఆలోచించండి ప్రజలారా ప్రజాస్వామికవాదులారా ఏదో మిమ్ములను, మీ నాయకత్వాలను ప్రశ్నించి, మిమ్ములను చులకన, పలచన చేయాలన్నది తమ అభిమతం కాదు. మా ఆవేదన, బాధ మొత్తం మనువాదులు అనుకూలంగా మలుచుకున్న ఈ ఎన్నికల వ్యవస్థపై అందరం పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్య యుద్ధం ప్రకటించి, ఆ మేరకు మనకు నూటికి 90 శాతం పైబడి వుంటున్న మన ప్రజలకు అనుకూలంగా మార్చాలన్న సదుద్దేశంతో బలంగా ఎదిగిన, ఎదుగుతున్న నాయకత్వాలకు ఈ సందర్భంగా నిర్మాణాత్మకమైన సూచనచేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏమిలేదు. సానుకూల దృక్పథం విజ్ఞత వివేకం గొప్పగా ప్రదర్శించి.. అన్ని అనర్థాలకు, సమస్యలకు మూల కారణం మరియు ఈవీఎం లను మట్టుబెట్టే, మహోన్నత కార్యక్రమంలో, ఈవీఎం వ్యతిరేక ఉద్యమంలో "మీరుమేముమనందరం" కలిసికట్టుగా ఐక్యంగా పెద్దఎత్తున పాల్గొంటూ భాగస్వాములమవుతూ మన చిరకాల న్యాయమైన "రాజ్యాధికార" స్వప్నాన్ని, మన ఆదర్శ మహనీయుల కలను సాకారం చేసుకుందాం S. అమానుల్లా వైస్సార్సీపీ లీడర్ హిందూపూర్.