
సాక్షి డిజిటల్ న్యూస్ జూలై 22 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు)మంగళవారం గార్ల ప్రభుత్వ ఆసుపత్రి (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) లో గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించి ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం కు బదిలీపై వెళ్తున్న డాక్టర్ శ్రీధర్ గౌడ్ కి వెళుతున్న సందర్భంగావీడ్కోలు సమావేశం సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ వి.స్వాతి, ఐ.రాణి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికిన గార్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం ఆత్మీయ వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ కే శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ నేను గత రెండు సంవత్సరాలుగా పనిచేసిన కాలంలో సహకరించిన సీనియర్ డాక్టర్లకు ప్రత్యేకంగా డాక్టర్ వి. హనుమంతరావు కి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ కు నర్సింగ్ ఆఫీసర్స్ కు పారామెడికల్ సిబ్బందికి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు అనంతరం సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ వి.స్వాతి మాట్లాడుతూ సూపర్డెంట్ తో గత రెండు సంవత్సరాలుగా పనిచేయడం ఎంతో సంతోషమని అలాగే ఏ టైంలో అయినా ఫోన్ చేసినా కూడా స్పందించి సరైన సూచనలు చేస్తూ మమ్ములను అందరిని ఒక తాటిపై నడిపిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నడిపించినందుకు డాక్టర్ శ్రీధర్ గౌడ్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ కార్యవర్గ సభ్యుడు బైరపాక శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా కూడా మాకు సహకరిస్తూ ప్రోత్సహించిన డాక్టర్ శ్రీధర్ గౌడ్ రాష్ట్ర జేఏసీ తరుపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ వి స్వాతి , ఐ. రాణి.నర్సింగ్ ఆఫీసర్స్ ఆశాలత, ఉపేందర్, రజిని, వెంకటరమణ, స్వాతి, సరిత.పారామెడికల్ సిబ్బంది తిరుమలరావు, అశోక్, మాధవి, స్వరూప, మల్లికాంబ, పర్వీన్, షకీరా కొత్త నర్సింగ్ ఆఫీసర్స్సానిటేషన్ సిబ్బంది దేవరాజ్, ఎల్లయ్య, సింధు, ఉపేందర్, చిన్ని, సావిత్రి తదితర సిబ్బంది అందరూ కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికినారు.