
*పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
సాక్షి డిజిటల్ న్యూస్ ఆగస్టు 10 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య) ఆషాఢ మాసం ముగింపు బోనాల సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.**ఈ సందర్భంగా పట్టణంలోని గోనెమ్మ బస్తి, ఏడు పోచమ్మ గుళ్ళు, ముత్యాలమ్మ గుడి, చైతన్య నగర్ పోచమ్మ గుడి, కింది బస్తి, ఎంజి రోడ్, సీతారామయ్య కాలనీ, అంబేద్కర్ కాలనీ, శాంతినగర్, జెపి కాలనీ, వెంకటేశ్వర కాలనీ తదితర కాలనీలలో పాల్గొని ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, పటాన్చెరు నియోజకవర్గం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. ఆషాఢ మాసం ముగింపు బోనాలతో పటాన్చెరు పట్టణమంతా భక్తి, ఆనందం, ఆధ్యాత్మికతతో పండుగ వాతావరణాన్ని తలపించింది. డప్పుల మోతలు, పోతరాజుల సందడి, అమ్మవారి బోనాలు, మహిళల భక్తి శ్రద్ధలు తెలంగాణ పల్లె సంస్కృతిని, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించాయని పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు