
మోదీ మునిగిపోతున్న నౌకను చూసి గోదీ మీడియా, ఐటీ సెల్, భజన బ్యాచ్ కూడా దూరమవుతున్నాయి .చివరకు మోదీ అర్థరాత్రి పూట రీల్స్ ఎందుకు చేయాల్సి వస్తోంది? ఓట్ల దొంగలు, చందాల దొంగలు,గుడి కానుకలను దొంగలించే ముఠా నాయకుడిగా విమర్శలు ఎదుర్కొంటున్న మోదీకి ఇప్పుడు అర్థరాత్రి కూడా నిద్ర పట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తుపై ఆందోళన ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తూ, చెప్పాలను కున్నది బయటికి చెప్పలేని పరిస్థితి వున్నది . ఒకప్పుడు వెంట నడిచిన అనుచరులు కూడా ఇప్పుడు దూరమయ్యారని, అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళన ఆయనను వెంటాడుతోందని చర్చ జరుగుతోంది. అర్థరాత్రి కెమెరా ముందు నిలబడి స్వయంగా వీడియోలు తీసుకోవడం, తనకుతానే వివరణ ఇవ్వడం, తనకుతానే ప్రశంసలు చేసుకోవడం. కాలచక్రం ఎంత వేగంగా తిరిగిందో ఈ దృశ్యాలు చెబుతున్నాయని విమర్శకుల అభిప్రాయం. ఎన్నో ఏళ్లుగా పబ్లిక్ రిలేషన్స్ వ్యవస్థ, గోదీ మీడియాపై ఆధారపడి నిర్మించిన ప్రచార వ్యవస్థ ఇప్పుడు బలహీనపడి తాము నిర్మించిన పేకమేడలు కూలిపోయే పరిస్థితి. అందుకే ప్రశాంతంగా నిద్రపట్టడం లేదని, చిరాకు ఆందోళన మోదీ మొఖంలో ఉన్నది. ప్రశ్న ఏమిటంటే... బీజేపీ ఐటీ సెల్, గోది మీడియా ఒక్కసారిగా మోడీని వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయిందిపగలు–రాత్రి సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేసినవారు, ట్రెండ్లతో ప్రజల దృష్టిని మళ్లించినవారు, అబద్ధాలను నిజాలుగా చూపించేందుకు ప్రయత్నించిన ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు ప్రభావం చూపలేకపోతున్నారు? ప్రజల్లో అసంతృప్తి పెరిగినప్పుడు ఎలాంటి ప్రచార కథనాలూ నిలవవని అర్థమైనది . ఐటీ సెల్ వ్యూహాలు ప్రభావం కోల్పోయాయని, వాటి ఆధారంగా ఇక రాజకీయంగా ముందుకు సాగడం కష్టమని మోదీ కూడా గ్రహించారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ మొత్తం ప్రచార వ్యూహం విఫలమైందా? లేక పార్టీ అంతర్గతంగా "మునిగిపోతున్న నౌకను కాపాడటం అసాధ్యం" అనే అభిప్రాయం ఏర్పడిందా? నౌక మునిగేటప్పుడు ముందుగా తెలివైనవారే ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తారని చెబుతూ, పెద్ద నాయకులు, వ్యూహకర్తలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడంతో మొత్తం బాధ్యతను మోదీ భుజాలపై వదిలేశారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం పరిణామంలో ప్రధాన మలుపు ఏమిటంటే... రాహుల్ గాంధీ నిర్భయంగా, నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల అధికార పక్షం రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిందని విమర్శకులు చెబుతున్నారు. పేపర్ లీకులు, ధరల పెరుగుదల, ఇతర మతాల మీద దాడులు ప్రతిపక్షం నాయకులపై అక్రమకేసులు,నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు అధికార పక్షాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు మీడియా ప్రశ్నలను తప్పించుకున్న నాయకులు ఇప్పుడు స్వయంగా వచ్చి వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారుఅర్థరాత్రి విడుదలవుతున్న ఈ వీడియోలు ఏదైనా "మాస్టర్ స్ట్రోక్" కాదని, ప్రజా మద్దతు తగ్గిపోతుందనే ఆందోళనకు సంకేతమని విమర్శిస్తున్నారు. నేల జారిపోతున్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు సహజమని, గోదీ మీడియాపై ప్రజల విశ్వాసం తగ్గిపోయిందని, ఐటీ సెల్ ప్రచారం కూడా ప్రభావం కోల్పోయిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు ప్రజలు నేరుగా ప్రశ్నలు అడుగుతున్నారు... సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక్క నాయకుడిపైనే పడిందని విమర్శకులు అంటున్నారు అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళనే ఆయనను వెంటాడుతోందని ఆరోపిస్తున్నారు.కాలం మారుతోంది. దేశంలో పెద్ద మార్పు తీసుకురావడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని సంకేతాలు సూచనలు కనిపిస్తున్నాయి.జై హింద్ 🇮🇳అమానుల్లా వైస్సార్సీపీ స్టేట్ మైనారిటీ వింగ్ సెక్రటరీ.