
సాక్షి డిజిటల్ న్యూస్ :25 జూలై 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు( రాము )ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , విద్యా & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ (పీటీఎం 4.0) కార్యక్రమం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం, ములకలచెరువు మండల పరిషత్ హైస్కూల్ , ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ , ములకలచెరువు ఎస్ఐ ఉమామహేశ్వర రెడ్డి , టీడీపీ మండల అధ్యక్షులు పాలగిరి సిద్ధ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ, విద్యార్థులలో నైపుణ్యం, సృజనాత్మకత పెంపొందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడంలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు, 'తల్లికి వందనం' వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైనింగ్ అవార్డ్స్ ద్వారా సత్కరించడం అభినందనీయమని చెప్పారు.ప్రతి విద్యార్థి అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లల చదువు, క్రమశిక్షణ, ప్రతిభ, ఆసక్తులను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంపొందించడమే మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా పురోగతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర రంగాల్లో సాధించిన విజయాలపై తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల ప్రగతి నివేదికలను తల్లిదండ్రులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూజారి సురేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి మారుజోల్లా సుదర్శన్, గోవిందు ఉత్తన్న, ఆవుల శంకర, కామాక్షి ఆంజనేయులు, ఈ. శంకర, స్కూల్ చైర్మన్ రాధిక , వైస్ చైర్మన్ మొఘల్ భావజన్, పవన్ కుమార్, ఏసు హరి, కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.