
సాక్షి డిజిటల్ న్యూస్ :18 జూన్ 2026 తంబళ్లపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ 2047 విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి సిబ్బంది పనితీరు బాగుందని తాసిల్దార్ శ్రీనివాసులు కొనియాడారు. గురువారం ఆయన విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను సందర్శించి సిబ్బందితో పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజక వర్గం లోని 6 మండలాల లోని సంబంధిత శాఖల సమస్యలను గుర్తించి పరిష్కారానికి సమస్యల ని వేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. మండలాలలోని ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ వారధిగా నిలుస్తుందని తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ యూనిట్ ద్వారా సమస్యలు పరిష్కారం కావడం హర్షనీయమని తాసిల్దార్ విలేకరులకు తెలిపారు. ఆయన వెంట వీఆర్వో నాగరాజు, యాక్షన్ ప్లాన్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.