సినిమా వార్తలు

మరో మల్టీస్టారర్ తో రాజమౌళి కొత్త సినిమా..! హీరోలు ఎవరో తెలుసా..?

సాక్షీ డిజిటల్ న్యూస్ :- కెరియర్ మొదటి నుంచి వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడు రాజమౌళి …ఆయన ఎంటైర్ కెరీర్ లో ఇప్పటివరకు ఒక సీరియల్ తో పాటు 12 సినిమాలను చేశాడు. అవన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకు గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి చేస్తున్న సినిమాలన్నీ తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ సినిమా దర్శకులందరితో తను కూడా పోటీ పడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి రాజమౌళి లాంటి దర్శకుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద తన శాయశక్తుల ప్రయత్నం చేసి ఎలాగైనా సరే దానిని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో కూడా మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటే తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మరోసారి భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇక ఆ సినిమాను కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య, ప్రభాస్ లను పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చాలాసార్లు సూర్యతో సినిమా చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎట్టకేలకు సూర్య – ప్రభాస్ లను కలిపి తను గతం లో చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా కంటే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఇద్దరు హీరోలుగా నటిస్తారా? లేదంటే ఒకరు హీరో మరొకరు విలన్ గా నటించే అవకాశాలు ఉన్నాయా అనే విషయాల మీద జక్కన్న ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికి తన తదుపరి సినిమాకి సంబంధించిన స్టోరీ ని రాజమౌళి ఫాదర్ అయిన విజయేంద్రప్రసాద్ చేసినట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *