Header Banner

క్రీడల్లో ఆశ్రమపాఠశాల విద్యార్థుల ప్రతిభ

ఏన్కూర్ అక్టోబర్ 16: సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

ఏన్కూరు మండల కేంద్రంలో రెండు రోజులపాటు నిర్వహించిన పాఠశాలల స్థాయి మండల క్రీడల్లో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారం పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు డియస్.నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఏ. సుస్మిత మరియు డిప్యూటీ వార్డెన్ బి.రవి లు పేర్కొన్నారు.క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాలలో గురువారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు డియస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులు మానసిక, శారీరక ఉల్లాసం కలిగి ఉంటారని, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశలోనే అలవర్చుకుంటారని తెలియజేశారు.జోనల్ స్థాయి,జిల్లా స్థాయి క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని విద్యార్థులను కోరారు.అండర్ -17 బాలుర వాలీబాల్, అండర్- 14 బాలుర వాలీబాల్ లలో ప్రథమ స్థానం సాధించారని, అండర్ -17 ఖోఖో లో ద్వితీయ స్థానం సాధించారని, అథ్లెటిక్స్ లో అండర్- 17, వంద మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో కే.దేవ ప్రధమ ద్వితీయా స్థానాలను, అండర్ -17 లాంగ్ జంప్ యందు ప్రథమ స్థానం బి. మహేందర్, ద్వితీయ స్థానం కే.దేవ సాధించారని తెలిపారు.జోనల్ స్థాయి క్రీడలకు మూలపోచరం పాఠశాల నుండి 20 మంది విద్యార్థులు ఎంపికైనందుకు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.రవి బి.శోభన్, కే.శ్యామల, బి.సింగ్యా, వి.రమేష్, జె. నాగేశ్వరరావు, టి. హరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.