వాహనదారులకు వివరిస్తున్న ఆర్టీవో శివలింగయ్య
సాక్షి డిజిటల్ న్యూస్ : 16 అక్టోబర్ 2025 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) వార్త విశ్లేషణ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండల మూడు రోడ్ల కూడలి నందు జిఎస్టి తగ్గింపు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్టీవో శివలింగయ్య. కార్యక్రమంలో భాగంగా శివలింగయ్య మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు అంటే ప్రతి వాహనం కొనుగోలుపై మరియు ప్రతి నిత్యవసర వస్తువు కొనుగోలుపై 26% జీఎస్టీ ఉన్న వస్తువు 13% కు తగ్గించారని జీఎస్టీ తగ్గింపు వల్ల వాహన కొనుగోలుదారులకు ఎక్కువ లాభాలు చేకూరుతాయని అన్నారు. కార్యక్రమంలో శివలింగయ్య తోపాటు హెడ్ కానిస్టేబుల్ రమణ, మండల సెక్రెటరీ, ఆటో యూనియన్ లీడర్స్ మహమ్మద్ రఫీ, కట్టుబడి మా భాష , ఖాదర్ బాషా, కాసిం, రియాజ్, మహేష్, కుట్టి, నరేష్, రాళ్లపల్లి బావాజీ, అస్రఫ్, ఫిరోజ్, బావ, శంకర్, చల్ల, సైదు, చాను, మౌలా, మున్నా, మాలిక్ షేక్ అయీ భాష,తదితరులు ఆటోలతో ర్యాలీ నిర్వహించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.