అనుమతులు లేకుండా బాణసంచా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు .

ఎస్ఐ.నారబోయిన సంధ్య.

సాక్షి డిజిటల్ న్యూస్ 19 అక్టోబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

అనుమతులు లేకుండా బాణా సంచా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని ఏన్కూర్ ఎస్సై, నార బోయిన సంధ్య అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, దీపావళి పండుగ సందర్భంగా గ్రామాల్లో బాణాసంచా అమ్మకాలు జరుపుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందకుండా బాణాసంచాల అమ్మకాలు జరిపితే ఎక్స్పోజిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఆమె అన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో లైసెన్సు పొంది బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసిన వారు తమ షాపులు దగ్గర తప్పకుండా ఫైర్ సేఫ్టీ విధానాలను అమలు జరపాలని ఆమె తెలియజేశారు. బాణాసంచాలు దుకాణాలు దారులు అందుబాటులో నీళ్ల డ్రమ్ములు బకెట్లలో ఇసుక ఉంచాలని ఎస్సై సంధ్య సూచించారు. టెంపరరీ లైసెన్స్ పొందిన దుకాణదారులు తమ కాలం పరిమితి అయిన తర్వాత బాణసంచాలు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై సంధ్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *