Header Banner

ఏన్కూర్ మండలంలో సబ్సిడీ యంత్రాల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్; 22 అక్టోబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు సబ్సిడీతో వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు అందించేందుకు ఏన్కూర్ మండలంలోని రైతు వేదిక కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైనదని మండల వ్యవసాయ అధికారి ఏ. నరసింహారావు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు జతచేసి అక్టోబర్ 24వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మండలంలోని రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని నరసింహారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు బాలకృష్ణ, భాగ్యలహరి, కమలాకర్, నవ్య, భవ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.