ఏన్కూర్ మండలంలో పర్యటించిన గిరిబాబు

సాక్షి డిజిటల్ న్యూస్ 23 అక్టోబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

ఏన్కూర్ మండలంలోని రేపల్లెవాడ గ్రామ నివాసి అయిన బానోత్ బాలాజీ అనారోగ్యం తో మృతి చెందగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అనంతరం నాచారం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చీదర వినోద్ తండ్రి, చీదర రామారావు గారి దశ దిన కర్మకు హాజరై వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భుక్యా వినోద్ కుమార్, భుక్యా ధర్మా నాయక్, షేక్ బాజీ, షేక్ చాంద్ పాషా, కడియాల సుధాకర్, రాచబంటి వీరభద్రం, శివకృష్ణ, షేక్ యాకుబ్, గుగులోత్ మజీలాల్, దారావత్ శంకర్, షేక్ షరీఫ్, ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *