Header Banner

జెడ్పిటిసి బరిలో వక్కంతుల నాగార్జున

సాక్షి డిజిటల్ న్యూస్ 25 అక్టోబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

ఏన్కూరు మండలం నాచారం గ్రామానికి చెందిన వక్కంతుల నాగార్జున కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా మండలం లోని అన్ని గ్రామాల ప్రజలతో సంబంధం కలిగి ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. తన తండ్రి అయిన వక్కంతుల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరపున పేదలకు అండగా నిలబడి, మంచి పేరును సంపాదించారు. మొదటినుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వక్కంతుల కుటుంబం. ఒక పర్యాయం నాచారం దేవస్థానం చైర్మన్ గా సేవలను అందించారు. అతని ఆశయాలను ముందుకు నడిపిస్తూ వక్కంతుల నాగార్జున ప్రజల పక్షాన అండగా నిలబడ్డాడు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని పలు పనులను ప్రజల సౌకర్యం కొరకు తన సొంత ఖర్చులతో పరిష్కరించారు. నాచారం గ్రామ యువతను ఉత్సాహపరిచి వారి ఆర్థిక సహాయంతో హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థ ద్వారా పల్లె దవాఖానాకు, పాఠశాలలకు పలు రకాలైన సామాగ్రిని సమ కూర్చారు. ఈ కార్యక్రమం ద్వారా పలు గ్రామాలకు నాచారం యువకులు ఆదర్శంగా నిలిచేలా చేశాడు. ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి నాయకులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా చురుకుగా పనిచేసి సీనియర్ నాయకుల జాబితాలో చేరాడు. గడచిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంఘటితపరిచి పార్టీ గెలుపు కోసం శ్రమించాడు. రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరికి ప్రధాన అనుచరుడిగా, అలాగే వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో మంచి సంబంధాలను కొనసాగిస్తు గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ప్రభుత్వ అధికారంలో కొంతమంది పార్టీలు మారి పదవులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ కోసం స్థిరంగా నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, పార్టీలు మారి వలసలు వచ్చినవారికే పదవులు దక్కుతున్నాయని ప్రజలు గుసగుసలాడుతున్నారు. అన్ని వర్గాల కులాలు, మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండి చిన్న పెద్ద అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి వక్కంతుల నాగార్జున. ప్రజల కోసం, పార్టీ కోసం నిర్విరామంగా శ్రమించిన వక్కంతుల నాగార్జున లాంటి యువ నాయకులకు పదవులు వరించాలనేది ప్రజల ఆకాంక్ష. జెడ్పిటిసీ గా అధిష్టానం అవకాశం ఇస్తే ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి ప్రజా క్షేత్రంలో ప్రజా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని అన్నారు.