సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
ఎల్‌ఐసీ సొమ్ముతో అదానీ పోర్ట్స్‌కు చెందిన రూ.ఐదు వేల కోట్ల బాండ్లు కొనుగోలు ప్రజానిధుల దుర్వినియోగానికి పరాకాష్ట అదానీ, అంబానీల వ్యాపార సేవలో తరిస్తున్న మోడీ సర్కార్ మరోసారి వారిపై తన అవ్యాజప్రేమను వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా అదానీకి అప్పులు ఇచ్చేందుకు ప్రపంచ ఆర్థిక సంస్థలు విముఖత చూపుతున్న సమయంలో ఆయన కోసం దేశ ప్రజలు అత్యంత నమ్మకంగా విశ్వసించే ఎల్‌ఐసీ నిధుల్ని బదలాయించేందుకు సిద్ధమైంది. ఎల్‌ఐసీ నుంచి దాదాపు రూ.33వేల కోట్లను అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోకి బాండ్లు, షేర్ల రూపంలోకి బదలాయింపు చేసేలా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ‘వాషింగ్టన్ పోస్ట్’ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. దీనితో అదానీ, మోడీ ఫెవికాల్ బంధం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.భారత్‌లో విశాల వ్యాపార సామాజ్య్ర విస్తరణలో భాగంగా అప్పుల భారంతో సంక్షోభంలో ఉన్న గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు కోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్‌ఐసీ ని బలి చేయడానికి మోడీ సర్కార్ సిద్దపడింది. అదానీ కంపెనీల్లో 3.9 బిలియన్ డాలర్ల దాదాపు రూ.33వేల కోట్లు బలవంతపు పెట్టు బడులకు ఎల్‌ఐసీపై ఒత్తిడి చేసిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ సంచలన రిపోర్ట్‌ను విడుదల చేసింది. అదానీ కంపెనీలకు భారీ నిధులను మళ్లించడానికి ఈ ఏడాది మేలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక ప్రతి పాదనలు రూపొందించారు. భారత ప్రజల జీవిత బీమా మొత్తాలను అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో పెట్టుబడులుగా పెట్టడానికి ప్రణాళికలు వేశారు. ఈ ఏడాది మొదట్లోనూ అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్‌ఐసి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.అప్పులివ్వని విదేశీ బ్యాంకులు అదానీపై లంచం, మోసం ఆరోపణలపై అమెరికా అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనేక అమెరికా, యూరోపియన్ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం అదానీ కోసం ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్రణాళికను రూపొందించిందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఆర్థిక మోసాలు, కృత్రిమంగా షేర్ల ధర పెంపు లాంటి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో అదానీ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్‌ఐసి నిధులను పణంగా పెట్టే కుట్ర జరిగిందని తెలిపింది.గతంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అదానీ ఆర్థిక అక్రమాలు, అవినీతిపై 2023 జనవరిలో న్యూయార్క్ కేంద్రంగా పని చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వరుస రిపోర్టులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదానీ కృత్రిమంగా తన కంపెనీల షేర్లను పెంచుకుంటున్నారని.. డొల్ల కంపెనీలతో పన్నులు ఎగ్గొడుతున్నారని విశ్లేషించింది. అదానీ కంపెనీలు ప్రమాదకర అప్పుల్లో ఉన్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి తోడు తాజాగా వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ, అటు ఇన్వెస్టర్లు, కార్పొరేట్ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజా నిధుల వినియోగంలో జవాబుదారీతనం అవసరమనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ఎవరి ఒత్తిళ్లు లేవు ఎక్స్’లో ఎల్‌ఐసీ పోస్ట్ అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి తమపై ఎవరి ఒత్తిళ్ళు లేవు. ఇది మా స్వతంత్ర నిర్ణయం. ప్రభుత్వ అధికారుల ప్రణాళిక మేరకే ఎల్‌ఐసీ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందనే ఆరోపణలు నిరాధారం. పెట్టుబడులపై మాదే తుది నిర్ణయం.ఆధారాలున్నాయి : వాషింగ్టన్ పోస్ట్
ఆర్థిక సేవల విభాగం డిఎఫ్‌ఎస్ ఎల్‌ఐసీ నుంచి పొందిన అంతర్గత పత్రాలు సహా అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా ప్రభుత్వం ఈ నిధుల మళ్లింపునకు ఏ విధంగా పాల్పడిందో గుర్తించాం. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి.అదానీకి నష్టం జరగనివ్వరు : కార్పొరేట్ ఫైనాన్స్ నిపుణులు హేమీంద్ర హజారీ ”అదానీకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హాని, నష్టాన్ని జరగనివ్వదు. ఆయన వ్యాపార సామాజ్య్రానికి అనుకూలంగా వ్యవహారిస్తోంది. అదానీ వ్యాపారాలను దేశ ఆర్థిక విజయాలుగా మోడీ సర్కార్ భావిస్తోంది.పీఏసీతో విచారణ జరపాలి : కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అదానీ గ్రూప్‌లో రూ.33 వేల కోట్ల ఎల్‌ఐసీ నిధులను పెట్టుబడి పెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వచ్చిన వ్యవహారంపై పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఏసీ తో విచారణ జరిపించాలి. అదానీ కంపెనీల్లోకి బలవంతంగా నిధుల బదలాయింపును సహించేది లేదు. అదానీ గ్రూప్ ప్రయోజనాల కోసం ఎల్‌ఐసీ పాలసీదారుల పొదుపును వాడుకోవడం దుర్మార్గం. సామాన్య ప్రజల జీవితకాల పొదుపులను ఒక ప్రయివేటు కంపెనీకి లబ్ధి చేకూర్చేలా దుర్వినియోగం చేశారు.అదానీ పోర్ట్స్‌లో…అదానీ పోర్ట్స్ అనుబంధ సంస్థ రుణాల రీఫైనాన్స్ కోసం జారీ చేసిన 585 బిలియన్ డాలర్ల దాదాపు రూ.5,000 కోట్లు బాండ్లను ఎల్‌ఐసీతో కొనుగోలు చేయించిన విషయాన్ని వాషింగ్టన్ ఫోస్టు బయటపెట్టింది. ఈ మొత్తం బాండ్లను ఎల్‌ఐసీ ఒక్కదాని తోనే కొనుగోలు చేయించడం గమనార్హం. ఇది ప్రజా నిధుల దుర్విని యోగానికి నిదర్శనమని తెలిపింది. ప్రభుత్వ ప్రణాళికలు ఎల్‌ఐసీ పారదర్శకత, భారత ఆర్థిక రంగ పునాదులపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో అదానీకి ఉన్న సుదీర్ఘ సన్నిహిత సంబంధాల కారణంగా ప్రభుత్వ అధికారులు అదానీ గ్రూపుల్లో పెట్టుబడుల కోసం ఎల్‌ఐసీపై ఒత్తిడి తెచ్చారు.