అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

సాక్షి డిజిటల్ న్యూస్ 28 అక్టోబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ సిహెచ్ శేషగిరిరావు కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏన్కూర్ మండలంలో అకాల వర్షాల వలన పత్తి పంట పొలాలలోనే నల్లబడి మొక్కలు రావడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన పత్తి పంటలను పరిశీలించి ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పత్తిలో తేమశాతం పేరుతో వ్యాపారులు రైతులు వద్ద నుండి ఎక్కువ తారాలుతీస్తూ రైతులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు నండూరి శ్రీనివాసరావు, నేలపట్ల వెంకటేశ్వరరావు, గుడ్ల వెంకటేశ్వరరావు, బండ్ల చిన్న జోగయ్య, రేపల్లెవాడ మాజీ ఎంపీటీసీ భూక్య లక్ష్మ నాయక్, సిఐటియు మండల కార్యదర్శి ఏర్పుల రాములు, కాలంగి నాగయ్య, కే నాగమణి, ఓరుగంటి, పడమర నరసింహారావు, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *