వేబ్రిడ్జి అధిక వసూళ్లు – రైతుల గుండెల్లో గుబులు

సాక్షి డిజిటల్ న్యూస్ 29 అక్టోబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

ఏన్కూరు మండల పరిధిలో రైతుల వద్ద నుండి వేబ్రిడ్జి నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వాహనానికి 50 రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి అధికారిక ఆదేశాలు లేకుండా ఒకేసారి ఛార్జీలను డబుల్ చేసి 100 రూపాయలకు పెంచి రైతులపై భారాన్ని మోపుతున్నారు. రైతులు చెబుతున్నదేమిటంటే మేము పంట పండించడానికి ఎంత కష్టం పడుతున్నామో ప్రభుత్వానికి తెలియదా, రైతుల కష్టాన్ని కొలిచే వేబ్రిడ్జి ని కూడా దందా గా మార్చేసిన నిర్వాహకులు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు అన్నీ పెరిగాయి. ఇప్పుడు పంటను అమ్మడానికి తీసుకెళ్లినా వేబ్రిడ్జి వద్ద అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఇది మాకు మరో భారం అని వాపోతున్నారు. వేబ్రిడ్జి నిర్వాహకులు రైతుల నిరసనలను పట్టించుకోకుండా రేట్లు పెరిగాయి అనే పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానిక ప్రజలు కూడా దీనిపై స్పందిస్తూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేట్ల ప్రకారం మాత్రమే వసూళ్లు జరగాలి. ఎవరికీ అదనపు డబ్బులు వసూలు చేసే అధికారం లేదు. ఇలాంటి దందాలను నిలువరించకపోతే రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు ఈ అంశంపై పరిశీలించి, రైతులపై జరుగుతున్న లూటీని అరికట్టాలని రైతులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *