సాక్షి డిజిటల్ న్యూస్ :
Warangal: మొంథా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్టు వర్షం కురవడంతో జనజీవనం స్థంభించింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.04 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. చెరువులు, కుంటలు తెగిపోగా.. కాలువలు. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు పొలాలను ముంచెసింది. చేతికొచ్చిన పంటలు నీటి పాలు అయ్యాయి. రైతులు లబోదిబోమంటున్నారు. చాలా చోట్ల రహదారులు తెగిపోయాయి. రవాణా వ్యవస్థ స్థంభించింది.