Header Banner

వీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం–వారసత్వ వివాదం

సాక్షి డిజిటల్ న్యూస్ :శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పీఠ మఠాధిపత్యంపై వివాదం పీఠం తనకే దక్కాలంటున్న రెండో భార్య కుమారుడు గోవిందస్వామి నియమ నిబంధనలకు విరుద్ధంగా అభిప్రాయ సేకరణ.కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠ పీఠాధిపత్యం నిబంధనలు విరుద్ధంగా జరిపారంటున్నారు పీఠాధిపత్యాన్ని ఆశిస్తున్న గోవిందస్వామి. వీరబ్రహ్మేంద్రస్వామి పీఠ మఠాధిపత్యంపై కొనసాగుతున్న వివాదంపై ఆయన స్పందించారు. మఠాధిపతి ఎంపిక విషయంలో ధార్మిక పరిషత్ తో పాటు.. పాటు ఎండోమెంట్ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిపాలంటూ పీఠాధిపత్యాన్ని ఆశిస్తున్న గోవిందస్వామి ఆరోపిస్తున్నారు. దివంగత పీఠాధిపతి వీరబోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి రెండో భార్య మారుతీ మహాలక్ష్మి కుమారుడే గోవిందస్వామి. మఠ పీఠం యొక్క నియమ నిబంధనలకు.. ఆచారాలకు విరుద్ధంగా కొంతమంది వ్యక్తులతో హడావుడిగా అభిప్రాయ సేకరణ జరిగిందని చెబుతున్న గోవింద స్వామి.