Header Banner

బ్రెజిల్‌లో భారీ పోలీస్ ఆపరేషన్ – రియోలో 61 మంది మరణించగా, 81 మంది అరెస్ట్!

సాక్షి డిజిటల్ న్యూస్ :బ్రెజిల్ చరిత్రలోనే అత్యంత భయానక పోలీస్ ఆపరేషన్ ఇది. రియో డి జనీరోలో డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను టార్గెట్ చేస్తూ.. సుమారు 2500 మంది పోలీసులు, సైనికులు.. దాడులు చేశారు. ఈ దాడుల్లో 60 మంది డ్రగ్ పెడ్లర్లు హతమయ్యారు. నలుగురు పోలీసు అధికారులు కూడా మరణించారు. మరో 81 మంది డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవారిని అరెస్టు చేసిన పోలీసులు.. భారీ ఎత్తున ఆయుధాలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు కొనసాగిన ఆపరేషర్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ భారీ ప్రాణనష్టంపై మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్యసమితి దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరం రియో డి జనీరోలో అత్యంత హింసాత్మకమైన పోలీస్ ఆపరేషన్ జరిగింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపు రెడ్ కమాండ్ ముఠాను పట్టుకునే దిశగా భద్రతా బలగాలు పెద్దఎత్తున ఆపరేషన్‌ నిర్వహించాయి. సుమారు 2500 మంది పోలీసులు, సైనికులు ఈ భారీ ఆపరేషన్‌‌లో పాల్గొన్నారు. కొన్ని గంటలు సాగిన ఈ పోరాటంల సాయుధ వాహనాలతో పాటు హెలికాప్టల్లను కూడా ఉపయోగించారు. కొన్ని గంటల పాటు నగరంలో కాల్పులు కొనసాగాయి. కొన్ని గంటలపాటు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా అధికారులతో సహా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 81 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 75 రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దాడుల సమయంలో సమీపంలోని 46 పాఠశాలలను మూసివేసినట్లు చెప్పారు. రియో చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆపరేషన్​ రాష్ట్ర గవర్నర్ క్లాడియో కాస్ట్రో అన్నారు. 93 రైఫిళ్లతో పాటు అర టన్నుకుపైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. సాధారణంగా బ్రెజిల్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతుంది. పెద్ద పెద్ద ముఠాలు, ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్లతో లింకులు ఏర్పాటు చేసుకుని.. వివిధ దేశాలకు మత్తుపదార్థాలను అక్రమ రవాణా చేస్తూ ఉంటాయి. అయితే బ్రెజిల్‌ పోలీసులు.. ఈ డ్రగ్స్ ముఠా ఆటకట్టించేందుకు ఆ దేశంలో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. దేశంలోని అత్యంత శక్తిమంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపుల్లో రెడ్‌ కమాండ్‌ ఒకటిగా ఉంది. ఈ ముఠాను లక్ష్యంగా చేసుకునేందుకు దాదాపు ఏడాది పాటు ప్రణాళికలు రచించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. దాడులను ప్రతిఘటించేందుకు రెడ్ కమాండ్ తీవ్రంగా ప్రయత్నించింది. అధికారులే లక్ష్యంగా దాడి చేసేందుకు ఈ డ్రోన్లు ఉపయోగించిందిఅయినా వెనక్కి తగ్గకుండా ఆపరేషన్​లో నిమగ్నమయ్యాయరని పేర్కొన్నారు. తమపై దాడులు చేసినా వారికి శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. దాడుల సమయంలో 46 పాఠశాలలను మూసివేసినట్లు నరగ విద్యాశాఖ తెలిపింది. రెడ్ కమాండ్ ముఠా సభ్యులు ఉత్తర, ఆగ్నేయ రియోలో రోడ్లను దిగ్బంధించారు. అందుకోసం కనీసం 70 బస్సులను నియమించారని, దీనివల్ల గణనీయమైన నష్టం జరిగిందని నగర బస్సు సంస్థ రియో ​ఒనిబస్ తెలిపింది. రియో డి జనీరోలో జరిగిన ఈ భారీ పోలీస్ ఆపరేషన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకాశంలో దట్టమైన పొగ భయబ్రాంతులకు గురి చేసింది. ఇదిలా ఉండగా తాజాగా పోలీసులు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్​ను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇది తమను భయభ్రాంతులకు గురిచేసిందని తెలిసింది. ఎంతో మంది అమాయకులు ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయారని, ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపలున్నాయి దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ పిలుపునిచ్చింది. ఈ హింసాత్మక ఘటన పెద్ద విషాదకరమని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ బ్రెజిల్‌ డైరెక్టర్‌ సీసార్‌ మయోజన్‌ అన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా ఒకటి. లాటిన్‌ అమెరికాలో ముఠాలు అక్కడి ప్రభుత్వాల కూల్చివేతకు, ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారాయి. లాటిన్ అమెరికా దేశాలు బ్రెజిల్‌, మెక్సికో మాదక ద్రవ్య మాఫియాలకు పెట్టింది పేరు. మాదక ద్రవ్యాల మాఫియాను నియంత్రించేందుకు చేస్తున్న అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నాలు పెద్దగా ఫలించడంలేదు. ఇక్కడి జైళ్లన్నీ ఈ కేసుల్లో పట్టుబడ్డ ఖైదీలతో నిందిపోతున్నాయి. జైళ్లలో కూడా ముఠాల మధ్యపోరాటం సర్వసాధాణం. మాఫియా ముఠాలు కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయి. ఈ ముఠాల మధ్య తరచూ ఆధిపత్యపోరు జరుగుతుంటుంది. ఇందులో ఎంతో మంది అమాయకులు మరణించడం సర్వసాధారణం. ఇక్కడి డ్రగ్ ముఠాలు రాజకీయాలను, ప్రభుత్వాలను కూడా నియంత్రిస్తాయి. మూడు దశాబ్దాల క్రితం 1993లో బ్రెజిల్‌ సావోపాలో నగర జైల్లో నేరగాళ్ల మధ్య కొట్లాట జరిగింది. కారణం ఏమిటంటే ఫస్ట్‌ కాపిటల్‌ కమాండ్‌ అనే కొత్త మాఫియా ఏర్పడటమే. ఇప్పుడది లాటిన్‌ అమెరికాలో, ప్రపంచంలో అతి పెద్ద ముఠాగా ఎదిగింది. దానిలో నలభైవేల మంది జీవిత కాల సభ్యులు, మరో అరవై వేల మంది దానితో సంబంధాలు కలిగి ఉన్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత మాదక ద్రవ్యాల రవాణా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కొకెయిన్‌ పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. కోకా ఉత్పత్తికి కేంద్రంగా లాటిన్‌ అమెరికా ఉంది. గతంలో కరీబియన్‌ ప్రాంతం నుంచి రవాణా జరిగితే ఇప్పుడు బ్రెజిల్‌ నుంచి ఎక్కువగా ఉంది. వీటిపై నిషేధం పెట్టినప్పటికీ పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. డ్రగ్స్‌ ముఠాలతో పాటు వారికి అవసరమైన ఆయుధాలను అందచేసే పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నాయి. ప్రస్తుతం మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, సరఫరా అన్నీ వికేంద్రీకరణ కావటంతో ఎక్కడైనా పట్టుబడిన వారు తప్పితే మిగతా నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. ప్రస్థుత బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా డ్రగ్ మాఫియాపై కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి ముఠాలను అడ్డుకొనేందుకు, రవాణా నిరోధానికి లూలా ప్రభుత్వం త్రివిధ దళాల నుంచి వేలాది మిలిటరీ, ఇతర భద్రతా సిబ్బందిని రేవులు, విమానాశ్రయాల్లో నియమించాల్సి వచ్చిందంటే సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.