Header Banner

నాగార్జునసాగర్ జలాశయం వద్ద కీలక నిర్ణయం – 20 గేట్లు ఎత్తి నీటిని విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ :నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరోసారి సాగర్‌లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు 20 గేట్లను ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 590అడుగులుగా నమోదైంది. ప్రాజెక్ట్ నీటిసామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 312 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో.. ఇన్‌ఫ్లో 3లక్షల 6వేల 62 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో అదే మోతాదులో కొనసాగుతోంది. స్పిల్‌వే గేట్ల ద్వారా 2లక్షల 72వేల 608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.