Header Banner

ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది, వర్షం కారణంగా సెమీఫైనల్ బ్రేక్

సాక్షి డిజిటల్ న్యూస్: 2025 మహిళల ODI ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండవ సెమీ-ఫైనల్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ నవీ ముంబైలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్మ్యాచ్ 6వ ఓవర్లో ఆస్ట్రేలియా కెప్టెన్ హీలీ(5)ని క్రాంతి గౌడ్ పెవిలియన్ చేర్చింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 5.1 ఓవర్లో 1 వికెట్ల కోల్పోయి 25 పరుగులు చేసింది. హీలీ క్యాచ్‌ మిస్ చేసిన హర్మన్‌ప్రీత్మ్యాచ్ మూడో ఓవర్ రెండో బంతికి ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ ఇచ్చిన సింగపుల్ క్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ మిస్ చేసింది. ఆ సమయంలో హీలీ కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ రికార్డులు..ఆస్ట్రేలియా ఆడిన గత 21 పూర్తి వన్డేల్లో ఎదుర్కొన్న ఏకైక ఓటమి గత నెలలో భారత్ చేతిలోనే. ఆ మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది ఈ ఫార్మాట్‌లోనే అతిపెద్ద ఓటమి. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ రికార్డులు..నాలుగేళ్ల క్రితం మాకేలో (Mackay), వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఉన్న 26 మ్యాచ్‌ల వరుస విజయాల రికార్డును (మార్చి 2018 – సెప్టెంబర్ 2021) భారత్ మాత్రమే బ్రేక్ చేసింది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ రికార్డులు..ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 15 మ్యాచ్‌లను గెలిచి రికార్డు సృష్టించింది. ఆ జట్టు చివరిసారిగా 2017 సెమీ-ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోచింది. ఉమెన్స్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక టాస్‌లు కోల్పోయిన జట్లు9 – ENG-W (ఇంగ్లాండ్) 1982లో8 – IND-W (భారతదేశం) 1982లో7 – SL-W (శ్రీలంక) 2000లో7 – SA-W (సౌత్ ఆఫ్రికా) 2025లో7 – IND-W (భారతదేశం) 2025లో ఇరు జట్లు:భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (కీపర్, కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్. టాస్ గెలిచిన ఆస్ట్రేలియాకీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచ కప్ రికార్డు ఎలా ఉంది?మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా 14 సార్లు తలపడగా, భారత్ మూడుసార్లు గెలిచింది. ఆస్ట్రేలియా 11 సార్లు గెలిచింది. ఇండియా-ఆస్ట్రేలియా గణాంకాలు..భారత్, ఆస్ట్రేలియా ఇప్పటివరకు 60 వన్డేలు ఆడగా, భారత జట్టు 11 గెలిచి 49 ఓడిపోయింది. భారత గడ్డపై ఆడిన 28 వన్డేల్లో ఆస్ట్రేలియా 23 గెలిచింది.

India vs Australia Live Score, Womens World Cup Semi Final: దక్షిణాఫ్రికా ఇప్పటికే మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇప్పుడు, రెండవ ఫైనలిస్ట్‌ను భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ ద్వారా నిర్ణయించనున్నారు. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ నవీ ముంబైలో జరుగుతోంది. ఇక్కడ కూడా వర్షం పడే అవకాశం ఉంది. 2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తన గ్రూప్ దశ మ్యాచ్‌లన్నింటినీ గెలిచి అజేయంగా నిలిచింది. మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో గత 15 మ్యాచ్‌లలో విజయ పరంపర నిరంతరాయంగా కొనసాగుతోంది. అందువల్ల, భారత జట్టు సెమీఫైనల్ బెర్తును దక్కించుకోవాలనుకుంటే, సెమీఫైనల్లో ఆసీస్ విజయాలకు అడ్డుకట్ట వేయాల్సిందే. 2017 నుంచి ఆస్ట్రేలియా ICC టోర్నమెంట్‌లో నాకౌట్ మ్యాచ్‌లో ఓడిపోలేదు. అయితే, ఎనిమిదేళ్ల క్రితం వారు చివరిసారిగా నాకౌట్ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓటమిపాలైంది. 2017 సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 171 పరుగులతో ఆకట్టుకుంది. మొత్తం మీద, ఆస్ట్రేలియా బలమైన గణాంకాలు, రికార్డులను కలిగి ఉన్నప్పటికీ, భారత జట్టు బలమైన ఆత్మవిశ్వాసాన్ని, స్వదేశంలో ఆడుతున్న అనుభూతిని, అలాగే అభిమానుల పూర్తి మద్దతును కలిగి ఉంది. యాదృచ్ఛికంగా, భారత జట్టు న్యూజిలాండ్‌ను ఓడించిన అదే మహిళల ODI ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఇది 2017 మహిళల ODI ప్రపంచ కప్‌లో జరిగింది. కాబట్టి ఈ యాదృచ్చికం ఈసారి కూడా పనిచేసే అవకాశం ఉంది. భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్. ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (కీపర్, కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్.