Header Banner

వేబ్రిడ్జి ధరలను తక్షణమే తగ్గించాలి – AMC చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్

సాక్షి డిజిటల్ న్యూస్ 30 అక్టోబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

ఏన్కూర్ మండల పరిధిలోని వేబ్రిడ్జి నిర్వాహకులు రైతుల నుండి అధికంగా వసూళ్లు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే, ఆ విషయమై స్పందించిన ఏన్కూర్ మార్కెట్ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్ వేబ్రిడ్జి నిర్వాహకులను మార్కెట్ కు పిలిపించి, జరిగిన విషయం గురించి ఆరాధిశారు. ఇక నుండి అధిక వసూళ్లకు పాల్పడకూడదని, తక్షణమే ధరలు తగ్గించి, రైతులకు అందుబాటు ధర కల్పించాలని అన్నారు. అలాగే మార్కెట్ లోని ప్రభుత్వ వేబ్రిడ్జి తాత్కాలికంగా పనిచేయడం లేదని, తక్షణమే మరమ్మత్తులు చేపించి, రైతులకు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి స్థానిక శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వానికి నివేదన అందించి ఆర్ధికంగా సహాయం చేసే ఏర్పాట్లు చేపిస్తానని హామీ ఇచ్చారు.