Header Banner

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌ టేబుల్‌ను విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 (సోమవారం) నుంచి ఫిబ్రవరి 21 (శనివారం) వరకు జరగనున్నాయి. రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయి. మొదటి సంవత్సరం ఇంగ్లీషు ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 (బుధవారం), రెండవ సంవత్సరం పరీక్షలు జనవరి 22 (గురువారం) న జరగనున్నాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు 2026 జేఈఈ-మెయిన్స్ 2026 షెడ్యూల్‌తో ఒకే సమయంలో వస్తే జేఈఈ-మెయిన్స్ లో హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఇక ఫస్టియర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు ఉంటాయి. ఇవాళ విడుదల చేసిన పరీక్షల తేదీలు తాత్కాలికంగానే విడుదలయ్యాయి. అధికారికంగా త్వరలోనే తేదీలను విడుదల చేస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 14వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుము (ఫైన్‌) లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇక అపరాధ రుసుముతో డిసెంబర్ 12 వరకు ఫీజులు చెల్లించవచ్చు.