Header Banner

బాలికపై కారు దూసుకెళ్లింది! షాకింగ్ ఘటన

సాక్షి డిజిటల్ న్యూస్ :ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మైనర్‌ బాలుడు కారు నడుపుతూ వెళ్తున్నాడు. ఓ వీధి మలుపు తిరుగుతుండగా ఎదురుగా ఓ బాలిక నడుచుకుంటూ వస్తోంది. కారును చూసి కంగారుపడిన బాలిక ఎటు వెళ్లాలో తెలీక.. వెనక్కు పరుగెత్తింది. అయితే, వేగంగా వచ్చిన ఆ కారు నేరుగా ఆ బాలికపైనుంచి దూసుకెళ్లింది. దీంతో భయపడిన ఆ బాలుడు.. కారు ఆపి గబగబా వచ్చి బాలికకు ఏమైందోనని కంగారుగా వచ్చి చూశాడు. అయితే, చక్రం కింద పడకుండా మధ్యలో పడిపోవటం, కారు ఆగగానే లేచి బయటకు రావటంతో ఆ బాలుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలో బాలిక తల్లిదండ్రులు అక్కడికి వచ్చి.. ఆ బాలుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్‌ బాలుడు నడిపిన కారు యజమానిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.