సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ఉందని ఏపీఎస్డీఎమ్ఏ అంచనా వేసింది. మొంథా తుఫాన్ ప్రభావం నుండి తేరుకోకముందే పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షారు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో మెంథా బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుషాన్ దెబ్బకు చాలా ప్రాంతాల్లో పంటనష్టం జరిగింది. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అంతే కాకుండా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి వర్షసూచన ఉండటంతో మళ్లీ ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.