Header Banner

సీనియర్లకు పెద్దపీట! సుదర్శన్‌రెడ్డి & ప్రేమ్ సాగర్‌‌రావు కేబినెట్ హోదా

సాక్షి డిజిటల్ న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అచితూచీ అడుగులు వేస్తోంది. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో తమకు అవకాశం వస్తుందని చాలామంది సీనియర్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆలస్యం కావడంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మరో ఇద్దరు నేతలకు కీలక పదవులను అప్పగించింది ప్రభుత్వం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌‌రావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావును నియమించింది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా పని చేశారు. పీసీసీ సభ్యుడిగా, పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్ఆర్ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018 నుంచి ప్రేమసాగర్ రావు ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఫ్లాగ్‌ షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలకు ప్రభుత్వ సలహాదారుగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని నియమించింది. ఇద్దరు నేతలకు కేబినెట్ హోదా లభించనుంది. కాంగ్రెస్‌కు కీలకమైన వ్యక్తుల్లో ఎమ్మెల్యే సుదర్శన్‌‌రెడ్డి మరొకరు. 1989లో రాజకీయాల్లోకి వచ్చిన తొలిసారి ఓటమి పాలయ్యారు. 1999 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.