Header Banner

సుశాంత్ అక్క షాక్ ఆరోపణలు: “ఇద్దరూ కలిసి చంపారు”

సాక్షి డిజిటల్ న్యూస్ :సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నాలుగేళ్ల తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని సోదరి శ్వేత సింగ్ కిర్తి తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. "సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు, అతన్ని హత్య చేశారు" అంటూ స్పష్టమైన ఆరోపణలు గుప్పించారు. బెడ్ నుంచి ఫ్యాన్ వరకు ఉన్న దూరం చూస్తే ఉరేసుకుని చనిపోవడం అసాధ్యమని ఆమె వివరించారు. మెడపై దుపట్టా గుర్తు లేదు, కేవలం చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించిందని తెలిపారు. అమెరికాలోని మానసిక నిపుణుడు, ముంబైలో మరో నిపుణుడిని సంప్రదించగా ఇద్దరూ ఒకేలా చెప్పారు. "ఇద్దరు కలిసి హత్య చేశారు" అని వారి అభిప్రాయం. ఇద్దరూ ఒకరికొకరు తెలియదు కానీ ఒకే మాట చెప్పారు. ఇది శ్వేతకు షాక్ ఇచ్చింది. సుశాంత్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అసూయతో చేతబడి చేయించారని ఆమె ఆరోపించారు. 2020 మార్చి తర్వాత సుశాంత్ బతకడని బెదిరింపు కాల్స్ వచ్చాయని వెల్లడించారు. అప్పట్లో నమ్మలేదు కానీ తర్వాత జరిగినవన్నీ సందేహాలు పెంచాయని శ్వేత అన్నారు. అధికారికంగా ఆత్మహత్య అని తేల్చినా ఈ కొత్త ఆరోపణలు కేసును మళ్లీ తెరిచాయి.