ఇంట్లోకి అనుమతించలేదని ఆగ్రహం – యువకుడు స్నేహితురాలి తల్లిపై దాడి!

సాక్షి డిజిటల్ న్యూస్:ప్రస్తుత జనరేషన్ యువత రోజురోజుకూ దారుణంగా తయారవుతున్నారు. చిన్న చిన్న వివాధాలకే నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా రాత్రి వేళ ఇంటికి రావొద్దన్నందుకు ఏకంగా స్నేహితురాలి తల్లినే కిరాతకంగా హత్య చేశారు స్నేహితులు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి పూట ఇంటికి రావొద్దన్న పాపానికి ఏకంగా స్నేహితురాలి తల్లినే ఫ్రెండ్స్ హత్య చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో వెలుగు చూసింది. బాధితురాలి కూతురి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌లకు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురానికి చెందిన నేత్రావతి అనే మహిళ స్థానికంగా లోన్‌రికవరి ఏజెంట్‌గా పినిచేస్తూ.. తన కూతురితో కలిసి నివసతిస్తోంది. అయితే ఈ నెల 25న నేత్రావతి తన కూతురితో పాటు ఇంట్లో ఉండగా.. తన కుతురు స్నేహితులైన నలుగురు బాలికలు ఇంటికి వచ్చారు. అయితే తన కూతురితో పాటు వీరంతా చదవుమానేసి ఊరికే ఉంటున్నారు. దీంతో వారు ఆ సమయంతో తమ ఇంటికి రావడంతో కొపగించుకున్న నేత్రావతి.. తమ ఇంటికి రావద్దని.. ఇక్కడి నుంచి వెళ్లకపోతే పోలీసులకు ఫోన్‌ చేస్తానని బెదిరించింది.

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం: దీంతో రెచ్చిపోయిన ఆ బాలికలు ఇంట్లోకి చొరబడి.. నేత్రావతిపై దాడి చేశారు. టవల్‌తో ఆమె గొంతునొక్కి హతమార్చారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు.. ఆమెను పక్కరూమ్‌లోకి లాక్కెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడదీశారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. ఎవరికైనా చెప్తే నిన్నూ కూడా చంపేస్తామని ఆమె కుమార్తెను కత్తితో బెదిరించారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ సంఘటనతో భయాందోళనకు గురైన నేత్రావతి కూతురు కూడా స్నేహితులతో పాటు వారి ఇంటికి వెళ్లిపోయింది. పోలీసులకు బాధితురాలి కూతురి స్టేట్‌మెంట్ అయితే మరుసటి రోజు విషయం తెలుసుకున్న నేత్రావతి సోదరి ఘటనా స్థలానికి చేరుకుంది. సోదరి మరణంపై అనుమానం కలిగి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నేత్రావతి మరణం తర్వాత ఆమె కుమార్తె అదృశ్యమైనట్టు తెలుసుకున్న పోలీసులు.. బాలిక కోసం గాలింపు చేపట్టారు. కానీ ఇంతలోనే గురువారం బాలిక తిరిగి ఇంటికి వచ్చింది. తన స్నేహితులే తల్లిని హత్య చేసినట్టు పోలీసులకు చెప్పింది.

బాధితురాలి కూతురిపై అనుమానం : కానీ బాధితురాలి సోదరి మాత్రం.. నేత్రావతి కూతురే స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. తన సోదరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధితురాలి కూతురి మాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఘటనపై అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *