సాక్షి డిజిటల్ న్యూస్ :నిత్యం లక్షలాది మంది ప్రయాణించేటటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు నిత్యం బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ ఎక్కువ అవుతున్నాయి. దీంతో విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. జెడ్డా నుండి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.ఈ మధ్య కాలంలో ఎయిర్‌పోర్టులు, విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ ఎక్కువైపోయాయి. ఇలా తరచూ బెదిరింపు మెయిల్స్ రావడంతో వారి మూలాల పై ఫోకస్ పెట్టారు అధికారులు. శంషాబాద్, ఢిల్లీ వంటి నిత్యంగా రద్దిగా ఉండే ఎయిర్‌పోర్టులను టార్గెట్ గా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు బాంబు బెదిరింపు మెయిల్స్‌తో ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. జెడ్డా నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావలసిన విమానాన్ని ముంబై ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ అధికారులు విచారణ చేస్తున్నారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి విమానాలు ఏర్పాట్లలో తరచూ ఈ మెయిల్స్ బెదిరింపులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నప్పటికీ త్వరితగతిన వాళ్లని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అటు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు నిత్యం భద్రతను కట్టు దిట్టం చేస్తూ తనిఖీలు చేస్తున్నారు.