కొత్త ఆధ్యాత్మిక ఆవిష్కరణకు శ్రీకారం – ఛత్తీస్‌గఢ్‌లో ‘శాంతి శిఖర్’ ప్రారంభించబోతున్న మోడీ

సాక్షి డిజిటల్ న్యూస్ :భారత్ ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా.. నేడు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన ‘శాంతి శిఖర్‌’ ను  ప్రారంభించనున్నారు. ఆధ్యాత్మిక శిక్షణ, శాంతి, ధ్యాన సాధనల కోసం  ఓ ఆధునిక కేంద్రంగా ఈ ‘‘శాంతి శిఖర్’’ను నిర్మించారు. ఈ సందర్భంగా  ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ఈ సంస్థ 1,600 చదరపు అడుగుల విస్తర్ణంలో ఒక రంగోలిని రూపొందించింది. ఈ రంగోలిలో ప్రధాని మోడీ తో పాటు బ్రహ్మకుమారీస్ సంస్థ మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దివంగత దాది జానకి చిత్రాలు ఉన్నారు. మృదుల హైర్డ్ దేవాంగన్ నేతృత్వంలోని కళాకారుల బృందం ఐదు రోజుల పాటు పనిచేసిన తర్వాత 60 కిలోగ్రాముల రంగుల పొడితో ఈ కళాకృతిని రూపొందించారు. పర్యటనలో భాగంగా.. మధ్యాహ్నం 2.30 గంటలకు ఛత్తీస్‌గఢ్‌ రజత్ మహోత్సవ్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే రోడ్లు, పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వంటి ముఖ్య రంగాల్లో రూ.14,260 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవంతో పాటు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *