సాక్షి డిజిటల్ న్యూస్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశిబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. రెయిలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు మృతిచెందినట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓ ప్రైవేట్ వ్యక్తి ఇటీవలే ఈ ఆలయాన్ని నిర్మించారు.