Header Banner

“మతం మారే ఆలోచన లేదు” – ఉష స్పష్టం

సాక్షి డిజిటల్ న్యూస్ :అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన సతీమణి ఉష వాన్స్‌ మతం గురించి చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. దీంతో ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలు రోత పుట్టిస్తున్నాయన్నారు.ఉష క్రిస్టియన్‌ మతస్థురాలు కాదని, మతం మారే యోచన లేదని స్పష్టం చేశారు. జేడీ వాన్స్‌ ఇటీవల మిసిసిపిలో టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందువుగా ఉన్న తన భార్య ఏదో ఒకరోజు క్రైస్తవంలోకి మారొచ్చని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు వచ్చాయి.