సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రభాస్‌తో సమంత యాక్ట్ చేయాలంటూ రిక్వెస్టు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అసలు ప్రభాస్ సమంతతో ఇప్పటి వరకు ఎందుకు యాక్ట్ చేయలేదనే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ప్రభాస్, సమంత జోడీగా ఓ సినిమాను మొదలెట్టాలని.. ఓ స్టార్ ప్రొడ్యూసర్ అనుకున్నాడట. టెస్ట్ షూట్ కూడా చేశారట. కానీ ప్రభాస్‌ది దాదాపు ఆరడుగుల పైనే ఎత్తు. సమంత ఎత్తు మాత్రం 5 అడుగుల రెండు అంగులాలే.. వీరిద్దరి మధ్య దాదాపు 10 అంగుళాల ఎత్తు తేడా ఉంది. దీంతో ఈ ఇద్దరికీ కలిపి కెమెరా ఫ్రేమ్ సెట్ చేయడం కష్టమైందట. దీంతో ఈ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయిందట. ఆ కారణంతోనే తామిద్దరం కలిసి ఇప్పటి వరకు ఒక సినిమాలో యాక్ట్ చేయలేదని ప్రభాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఈ మధ్య మళ్లీ ప్రభాస్, సమంత కలిసి ఓ సినిమా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకోవడంతో మరో సారి ప్రభాస్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.