Header Banner

చేవెళ్ల మండల సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం

సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

గుగులోత్ భావుసింగ్ నాయక్

సాక్షి డిజిటల్ న్యూస్ 3 నవంబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

ఈరోజు తెల్లవారుజామున చేవెళ్ల మండల సమీపంలోని రాష్ట్ర రహదారిపై బస్సు మరియు టిప్పర్‌ లారీ ఢీకొని జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. సుమారు 72 మంది ప్రయాణిస్తున్న బస్సులో ఎక్కువ శాతం విద్యార్థులు, ఉద్యోగులు ఉండటం మరింత హృదయవిదారకం.ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబాలకు వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిటీ సొసైటీ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ గాయపడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ వైద్యం కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించి, ప్రభుత్వం భారం మీద ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స చేయాలి.
రోడ్లు దారుణంగా ఉన్నాయి. రోడ్ల మరమ్మత్తులు మరియు మౌలిక వసతుల అభివృద్ధిలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశారు.