Header Banner

హుస్సేన్‌సాగర్‌లో ముగిసిన తల్లి–కూతురి ప్రాణాలు!

సాక్షి డిజిటల్ న్యూస్ :కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బహదూర్‌పురలో నివాసముంటూ వ్యాపారం చేస్తున్న పృద్విలాల్, చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న కీర్తిక అగర్వాల్(28) దంపతులకు రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. అయితే ఈ దంపతుల మధ్య గొడవలు తలెత్తడంతో వీరు రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. కీర్తిక బహదూర్‌పురలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్ద కుమార్తెతో కలిసి ఉంటోంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ.. ఈనెల 2న రెండేళ్ల కూతురుతో కలిసి కీర్తిక అగర్వాల్ ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.నెక్లెస్ రోడ్డులోని నీరా కేప్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు లభ్యం కాకపోవడంతో మార్చురీకి పోలీసులు తరలించారు. తమ కుమార్తె, మనుమరాలు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ కీర్తిక అగర్వాల్ గా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే ఆమె తల్లిదండ్రులకు లేక్ పోలీసులు సమాచారం అందించారు. మంగళవారం పాప మృతదేహాన్ని గుర్తించారు. తల్లి కూతుర్ల మృతదేహాలను ఎమ్మార్వో సమక్షంలో గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఆత్మహత్య చేసుకున్న కీర్తిక అగర్వాల్(28) ఓ ప్రైవేట్ కంపెనీలో సంవత్సరానికి రూ. 25 లక్షల ప్యాకేజీలో చార్టెడ్ అకౌంట్ గా పని చేస్తుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అంటున్నారు. సోమవారం కీర్తిక అగర్వాల్ తన పాపతో కలిసి ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.