Header Banner

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో మండిపడ్డ ఆటో డ్రైవర్ – పోలీస్ ఎదుటే తీవ్ర చర్య!

సాక్షి డిజిటల్ న్యూస్ :ఆటో డ్రైవర్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కాడు.. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు.. కేసు నమోదు చేశామని.. తర్వాత కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా జరిమానా కూడా ఉంటుందని తెలిపారు. అయితే.. పోలీసులకు పట్టుబడటంతో ఆటోడ్రైవర్ మనస్తాపం చెందాడు.. చివరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట.. మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగిరెడ్డి మీన్‌రెడ్డి అనే ఆటో డ్రైవర్‌ మంగళవారం సాయంత్రం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో రీడింగ్‌ 120 వచ్చింది.. దీంతో మీన్ రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన మీన్ రెడ్డి అర్ధరాత్రి కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం మంటలు ఆర్పి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మీన్ రెడ్డి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.మీన్‌రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే మీన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.