భారత్, రష్యా డీల్: శత్రు దేశాల గుండెల్లో పరుగులు..!

సాక్షి డిజిటల్ న్యూస్ :రక్షణ రంగంలో భారతదేశానికి చిరకాలంగా సహకరిస్తూ వస్తున్న రష్యా.. తాజాగా మరో ఆఫర్ ఇచ్చింది. సుఖోయ్-30MKI ఫైటర్ జెట్లలో ఉపయోగించేందుకు రష్యా తన “Kh-69 స్టెల్త్ ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్” క్షిపణి (ALCM) టెక్నాలజీకి భారత్‌కు బదిలీ చేసేందుకు ప్రతిపాదించింది. తద్వారా ఈ క్షిపణులను భారతదేశం స్వయంగా తయారుచేసుకుని, తమ యుద్ధ విమానాల్లో ఉపయోగించుకోవచ్చు.రక్షణ రంగంలో భారతదేశానికి చిరకాలంగా సహకరిస్తూ వస్తున్న రష్యా.. తాజాగా మరో ఆఫర్ ఇచ్చింది. సుఖోయ్-30MKI ఫైటర్ జెట్లలో ఉపయోగించేందుకు రష్యా తన “Kh-69 స్టెల్త్ ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్” క్షిపణి (ALCM) టెక్నాలజీకి భారత్‌కు బదిలీ చేసేందుకు ప్రతిపాదించింది. తద్వారా ఈ క్షిపణులను భారతదేశం స్వయంగా తయారుచేసుకుని, తమ యుద్ధ విమానాల్లో ఉపయోగించుకోవచ్చు. తద్వారా భారత వైమానిక దళ సామర్థ్యం మరింత పెరుగుతుంది. సరికొత్త ఊపునిచ్చింది.ఈ స్టెల్త్ క్షిపణి రేంజ్ 400 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ఇది తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదు. అంటే శత్రుదేశాల రాడార్ల కళ్లు గప్పి లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. Kh-69 సుమారు 710 కేజీల బరువు ఉంటుంది. ఇందులో 310 కేజీల అధిక-పేలుడు వార్‌హెడ్‌ ఉంటుంది. ఈ క్షిపణిని టాక్టికల్ మిస్సైల్స్ కార్పొరేషన్ (KTRV) అభివృద్ధి చేసింది. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధంలో కూడా ఈ క్షిపణిని ప్రయోగించింది. దీనికి మరికొన్ని ప్రత్యేకతలున్నాయి. డిజైన్ పరంగా చూస్తే ఇది పరిశీలించడానికి ఆస్కారం తక్కువగా ఉండే డిజైన్ కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గైడెడ్ వ్యవస్థ, ఇనర్షియల్ నావిగేషన్, ఉపగ్రహం (గ్లోనాస్/GPS)తో పాటు ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్ సీకర్ ఉన్నాయి. ఇవన్నీ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తాయి.ప్రస్తుతం భారత వైమానిక దళంలోని సుఖోయ్-30MKI యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్-ఎ సూపర్ సోనిక్ క్షిపణులను అమర్చి ప్రయోగిస్తున్నారు. దీని రేంజ్ 290 – 450 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. అయితే బ్రహ్మోస్ బరువు దాదాపు 2,500 కిలోలు. అంటే ఇది ఒకేసారి ఒకటి లేదా రెండు క్షిపణులను మాత్రమే మోసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది. రష్యా అందించే Kh-69 మిస్సైల్ బ్రహ్మోస్‌తో పోల్చితే తేలికైనది. సుఖోయ్ ఫైటర్ జెట్లు ఒకేసారి నాలుగు క్షిపణులను మోసుకెళ్లడానికి వీలుంటుంది. తద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు యుద్ధ రంగంలో మరింత మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది.

భారత్‌లోనే తయారీ

ఈ క్షిపణులను తయారు చేసే టెక్నాలజీని బదిలీ చేయడం ద్వారా వాటిని మన దేశంలోనే తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ముందుగా భారత్ కనీసం 200-300 Kh-69 మిస్సైళ్లకు ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు వాటిలో కొన్నింటిని రష్యా నుంచి నేరుగా భారత్‌కు ఎగుమతి చేసి, మగతావాటిని భారత్‌లోనే తయారు చేయడానికి వీలుగా టెక్నాలజీ, బ్లూప్రింట్ అందజేస్తుంది. భారత్‌లో వీటిని హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వంటి సంస్థలను రష్యా తమ భాగస్వాములుగా ఎంచుకునే అవకాశం ఉంది.

అవసరాలు.. అడ్డంకులు.. అవకాశాలు భారత వైమానికదళం అవసరాలను గమనిస్తే 42 స్క్వాడ్రన్లు అవసరం ఉండగా.. ప్రస్తుతం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశానికి చిరకాల శత్రు దేశం పాకిస్తాన్‌తో పాటు చైనా నుంచి ముప్పు పెరుగుతున్న సమయంలో రష్యా ఇస్తున్న ఆఫర్ వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. అయితే CAATSA ఆంక్షలు, పశ్చిమ దేశాలతో భారతదేశానికి పెరుగుతున్న రక్షణ సహకారం ఈ ఒప్పందాన్ని క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని 2026 ప్రారంభంలో భారత ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రష్యా ఆఫర్ భారతదేశానికి ఒక ప్రధాన వ్యూహాత్మక అవకాశంగా పరిగణించవచ్చు. ఇది మేక్ ఇన్ ఇండియా సంకల్పానికి సైతం ఊతమిస్తోంది. భారత వైమానిక దళంలో ఉన్న సుఖోయ్ ఫైటర్ జెట్ల సామర్థ్యాన్ని సైతం పెంచుతుంది. అలాగే లాంగ్ రేంజ్ స్టెల్త్ ఎటాక్ సామర్థ్యాన్ని సైతం గణనీయంగా మెరుగుపరుస్తుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *