Header Banner

బంగారం ధరలు డౌన్‌-మెల్లగా కాస్త ఊరట

సాక్షి డిజిటల్ న్యూస్ :నవంబరు 5 బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980లు తగ్గి రూ.1,21,480కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.900 తగ్గి రూ.1,11,350కు చేరింది. కేజీ వెండిపై రూ.2000 తగ్గి రూ.1,63,000 పలుకుతోంది. కాగా, రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బుధవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,21,630, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,500 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,480 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,11,350 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,970, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,800 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,480, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,350 గా ఉంది. వెండి కేజీ రూ.1,51,000లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,21,480 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,11,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,63,000 లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటల తర్వాత నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.