ఇదేం పనిరా సామీ: స్టేషన్‌లో దుకాణం పెట్టిన షాక్ కదనం!

సాక్షి డిజిటల్ న్యూస్ :మనల్ని‌ ఎవడ్రా ఆపేది అనుకున్నారో.. లేక మాకు తిరుగు లేదు అనుకున్నారేమో కానీ స్టేషన్‌నే పేకాట క్లబ్‌గా మార్చేశారు ఆ ఎక్సైజ్ పోలీసులు. అక్రమ మద్యపానంపై ఉక్కు పాదం మోపాల్సింది పోయి, మూడు పెగ్గులు.. ఆరు ముక్కలు.. అన్నట్టుగా పేకాటలో మునిగిపోయారు. సకుటుంబ సమేతంగా అన్నట్టుగా ఆఫీస్ స్టాప్ అంతా కలిసి దర్జాగా ఎక్సైజ్ కార్యాలయంలోనే పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కారు. ఈ భాగోతం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ కార్యాలయంలో చోటు‌ చేసుకుంది.చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్ లో ఓ హెడ్ కానిస్టేబుల్ తో సహా మరో ఐదుగురు కానిస్టేబుళ్లు కలిసి పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో , పేకాట ఆడుతున్న సిబ్బంది పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసాంఘీక కార్యకలాపాలను నిర్మూలించే బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్న వారే ఇలా పేకాట ఆడటం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఎక్సైజ్ స్టేషన్ లో ఈ వ్యవహారం సాగుతుందని ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి‌. ఇప్పటికైనా ఎక్సైజ్ కార్యాలయాన్ని పేకాట క్లబ్ గా మార్చిన సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *