కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. యోగేశ్వర శర్మ

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి , వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు , విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల తాకిడి అధికంగా వుంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతం ప్రాంతాల్లో ఇదే రోజుని దేవ దీపావళి , దేవ దివాళి అని అంటుంటారు. ముఖ్యంగా ఈరోజున వారణాసిలోని గంగా నది ఒడ్డున వున్న ఘాట్లు అన్నీ దీపాల అలంకరణతో శోభాయమానంగా వెలిగే దృశ్యం చూపరులని కట్టిపడేస్తుంది. అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల త్రిపుర పూర్ణిమ , త్రిపురారి పూర్ణిమ అని పిలుస్తుంటారు. శివుడు త్రిపురాసురుడిని అంతమొందించింది ఈరోజే కావడంతో… ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణిమ , త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుచుకుంటుంటారు.కార్తీక పౌర్ణమి రోజునే విష్ణువుని కూడా పూజించడానికి ఓ కారణం వుంది. మహాప్రళయం బారి నుంచి మనుని రక్షించడానికి ఆ శ్రీ మహా విష్ణువు మత్సావతారం ఎత్తింది ఈ కార్తిక పౌర్ణమి రోజునే. అందుకే ఇవాళ విష్ణువుని కూడా ఆరాధిస్తుంటారు. ఈ కార్తీక పౌర్ణమికి ప్రభోదిని ఏకాదశికి కూడా ఓ సంబంధం వుంది. ప్రభోదిని ఏకాదశితో ఆరంభం అయ్యే చతుర్మాసం పండగలన్నీ మళ్లీ నాలుగు నెలల తర్వాత ఈ కార్తీక పౌర్ణమితో ముగుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *