సాక్షి డిజిటల్ న్యూస్ :పశ్చిమ సరిహద్దులో భారత త్రివిధ దళాలు త్రిశూల్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు పాల్గొంటున్న ఈ బల ప్రదర్శన పాకిస్తాన్‌ను తీవ్రంగా వణికించింది. త్రిశూల్ విన్యాసాల నేపథ్యంలో, పాకిస్తాన్ తన గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాక్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంతో పాటు రాజస్థాన్‌లోని థార్ ఎడారి, గుజరాత్, అరేబియా సముద్ర తీరంలో ఈ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ విన్యాసాలలో స్వదేశీ డ్రోన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.