సౌకర్యాలుమెరుగుపరచాలి.

సాక్షి డిజిటల్ న్యూస్ 5 నవంబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

మండలంలో అనేక దళిత ,గిరిజన కాలనీలలో వర్షాల వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ,కొన్ని ఏరియాలకి మంచినీటి సౌకర్యాలు లేవని కొన్ని రహదారులు పాడైపోయినాయని కొన్నిచోట్ల వీధి దీపాలు వెలగడం లేదని కావున అధికార సిబ్బంది వెంటనే జోక్యం చేసుకొని కాలనీలలో, తండాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ముత్తమాల . ప్రసాద్, ఉపాధ్యక్షులు పాపిట్ల. సత్యనారాయణలు డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 78 వసంతాలు పూర్తయినా మౌలిక వసతులు కల్పించలేని దుర్భర పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. వెంటనే జోక్యం చేసుకోని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారందరికి ఉపాధి కల్పించాలని రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడాలని, గ్రామాలలో వివక్షత కొనసాగుతుందని వీటిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో సమావేశం నిర్వహించి వీటిపై తగు కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని కావున దళిత గిరిజన బహుజనులు ఏకమై సమస్యలపై ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని రాజ్యాంగం స్వాతంత్రం ఫలాలు స్వేచ్ఛ సమానత్వం సాధించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందు, లక్ష్మణ్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *