సాక్షి డిజిటల్ న్యూస్ :ఆలయాలను టార్గెట్ చేస్తున్న దొంగలు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి సమయంలో ఆలయాల్లోకి చొరబడి చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా.. గోకవరం మండలం మల్లవరం గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డాడు యువకుడు. దర్జాగా ఆలయంలోని రెండు హుండీలలోని నగదును ఎత్తుకెళ్లాడు. ఆలయ వైస్ చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. దొంగతనానికి పాల్పడిన యువకుడు అదే గ్రామానికి చెందిన గుర్రం సాయి ఆదిత్య మాధవన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిరి అరెస్ట్ చేసి, రాజమహేంద్రవరం జ్యూడిషియల్ కోర్టులో హాజరు పర్చారు. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లుగా ఎస్సై పవన్ వెల్లడించారు.