Header Banner

వయసు కేవలం సంఖ్యే అంటున్న కమల్ హాసన్ – ఫిట్నెస్ రహస్యాలు ఇవే

సాక్షి డిజిటల్ న్యూస్ :సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో కమల్ హాసన్ ఒకరు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి రహస్యం కఠినమైన ఆహార ప్రణాళిక, నిరంతర వ్యాయమాలు చేయడమే. రోజూ జిమ్ లో వర్కవుట్స్ చేయడంతోపాటు యోగా సైతం చేస్తుంటారు.లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆరేళ్ల వయసులో సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా ఎంతో ఫిట్ గా ఉన్నారు. కమల్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.కమల్ హాసన్ ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఆయన డైట్ ప్లాన్, వ్యాయమాలే. కమల్ హాసన్ రోజూ 1-2 గంటలు జిమ్‌లో వర్కౌట్ చేస్తాడు. ఇందులో జిమ్ శిక్షణతో పాటు వెయిట్ లిఫ్టింగ్ , భుజం బలపరిచే వ్యాయామాలు కూడా ఉన్నాయి. సంవత్సరంలో చాలా రోజులు షూటింగ్‌లో బిజీగా ఉంటారు.జిమ్‌తో పాటు 30 నిమిషాల యోగా కూడా చేస్తారు. ఇదే ఆయన ఆరోగ్యానికి కారణం. మానసిక ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. కమల్ హాసన్ 14 కి.మీ నడుస్తాడు. అతను ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారు. రోజూ శరీరానికి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ అందిస్తాడు.అలాగే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండడంతోపాటు పండ్లు, కూరగాయలతో ఇంట్లో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. అందుకే 71 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా ఉన్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.గతేడాది థగ్ లైఫ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ 3 సినిమాతోపాటు కల్కి 2 చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు నిర్మాతగాను వరుస సినిమాలు నిర్మిస్తున్నారు.