నవంబర్ 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25వేల ఓట్లు సాధించిన బీజేపీకి, 2024 ఎంపీ ఎన్నికల్లో అక్కడే 64 వేల ఓట్లు ఎలా వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కి చాలెంజ్ చేశారు. పార్లమెంట్లో చేసిన సహాయానికి కేసీఆర్కు గురు దక్షిణ కింద వారి అభ్యర్థిని బలిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 68,979 ఓట్లు పడగా, కాంగ్రెస్ పార్టీకి 52,975, బీజేపీకి 8,517 పడ్డాయి. అదే విధంగా, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 80,549 ఓట్లు పడగా.. కాంగ్రెస్ పార్టీకి 64,212 ఓట్లు, బీజేపీకి 25,866 ఓట్లు పడ్డాయి. ఇక, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 89,705 ఓట్లు పడగా.. బీజేపీకి 64,673 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 18,405 మాత్రమే పడ్డాయి. 2023 శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 25 వేల ఓట్లు సాధిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అదే శాసభ సభ నియోజకవర్గం నుంచి 64 వేల ఓట్లు బీజేపీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2023 శాసన సభ ఎన్నికల్లో 80 వేల ఓట్లు వస్తే పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 18 వేల ఓట్లు ఎలా వచ్చాయన్నారు. ఎన్నికల ఫలితాలను వెబ్ సైట్లో చూస్తే స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే శాసన సభలో బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వడం వల్లే లోపాయికారి ఒప్పందం వల్లే ఓట్లు పెంచుకోవాలన్నారు.
సాక్షి డిజిటల్ న్యూస్ :నవంబర్ 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25వేల ఓట్లు సాధించిన బీజేపీకి, 2024 ఎంపీ ఎన్నికల్లో అక్కడే 64 వేల ఓట్లు ఎలా వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కి చాలెంజ్ చేశారు. పార్లమెంట్లో చేసిన సహాయానికి కేసీఆర్కు గురు దక్షిణ కింద వారి అభ్యర్థిని బలిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 68,979 ఓట్లు పడగా, కాంగ్రెస్ పార్టీకి 52,975, బీజేపీకి 8,517 పడ్డాయి. అదే విధంగా, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 80,549 ఓట్లు పడగా.. కాంగ్రెస్ పార్టీకి 64,212 ఓట్లు, బీజేపీకి 25,866 ఓట్లు పడ్డాయి. ఇక, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 89,705 ఓట్లు పడగా.. బీజేపీకి 64,673 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 18,405 మాత్రమే పడ్డాయి. 2023 శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 25 వేల ఓట్లు సాధిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అదే శాసభ సభ నియోజకవర్గం నుంచి 64 వేల ఓట్లు బీజేపీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2023 శాసన సభ ఎన్నికల్లో 80 వేల ఓట్లు వస్తే పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 18 వేల ఓట్లు ఎలా వచ్చాయన్నారు. ఎన్నికల ఫలితాలను వెబ్ సైట్లో చూస్తే స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే శాసన సభలో బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వడం వల్లే లోపాయికారి ఒప్పందం వల్లే ఓట్లు పెంచుకోవాలన్నారు.