సాక్షి డిజిటల్ న్యూస్:తిరుమల శ్రీవారిపై భక్తులు కాసుల వర్షం కురిపించారు. అక్టోబర్ శ్రీవారి హుండీకి రికార్డ్ ఆదాయం వచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో వివరాలు వెల్లడించారు. అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారిని 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. గత నెలలో హుండీ ఆదాయం రూ. 119.35 కోట్లు వచ్చిందని వెల్లడించారు. 1.23 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయని చెప్పారు. కాగా, నవంబర్ 17 నుంచి 25 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.వడ్డీకాసుల వాడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవిదేశాల భారీగా భక్తులు తరలివస్తుంటారు. భారీఎత్తున శ్రీనివాసుడికి విరాళాలు సమర్పిస్తారు. ఎవరి స్తోమత బట్టి వారు స్వామికి బంగారు, వెండి, ఇతర విలువైన ఆభరణాలు, వస్తువులను కానుకలుగా ఇస్తారు. సాధారణంగా భక్తులందరూ కానుకలను ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో వేస్తారు. అయితే అక్టోబర్ నెలలో కూడా భక్తులు భారీ తరలివచ్చి.. శ్రీనివాసుడిపై కాసుల వర్షం కురిపించారు. తాజాగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయాన్నితిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అంతేకాకుండా అక్టోబర్ మాసంలో శ్రీవారిని ఎంత మంది భక్తులు దర్శించుకున్నారు, లడ్డూల విక్రయాల గురించి వివరాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ వెల్లడించారు.తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా శ్రీవారికి హుండీకి రూ. 119.35 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా అక్టోబర్లో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని పేర్కొన్నారు. అలాగే టీటీడీ అన్న ప్రసాద ట్రస్ట్ ద్వారా 34.20 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని వెల్లడించారు. దాదాపు 8.31 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ పేర్కొన్నారు.కార్తీక బ్రహ్మోత్సవాలు మరోవైపు, నవంబర్ 17 నుంచి 25 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు . నవంబర్ 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. నవంబర్ 16న ఉదయం లక్ష కుంకుమార్చన.. సాయంత్రం శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. ఇక శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో.. ఉదయం 8 నుండి 10 గంటల వరకు.. రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.