సాక్షి డిజిటల్ న్యూస్ :భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల సౌతాఫ్రికాను ఓడించి తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్ గెలిచిన తర్వాత టీమ్‌లోని సభ్యులందరికీ ట్రోఫీతో పాటు మెడల్స్ అందజేశారు. అయితే జట్టులో అంతర్భాగంగా ఉండి అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ యంగ్ ప్లేయర్ ప్రతికా రావల్‌కు మాత్రం మెడల్ దక్కలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ స్క్వాడ్‌లో ఉన్న 15 మంది ఆటగాళ్లకు మాత్రమే మెడల్ ఇవ్వాలి. ప్రతికా రావల్ గాయం కారణంగా ఫైనల్‌లో ఆడకపోవడం వల్ల ఆమెకు మెడల్ దక్కలేదు. అయితే, ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి జై షా జోక్యం చేసుకోవడంతో ఐసీసీ తమ నిబంధనను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతికాకు కూడా విన్నింగ్ మెడల్ అందనుంది.గత ఆదివారం నవీ ముంబైలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ విజయం తర్వాత భారత జట్టుకు ట్రోఫీతో పాటు మెడల్స్ అందజేశారు. అయితే, ఆ సమయంలో జట్టు సభ్యురాలైన ప్రతికా రావల్‌కు మెడల్ దక్కలేదు. టోర్నమెంట్‌లో ఆడినప్పటికీ, ఫైనల్‌లో స్క్వాడ్‌లో ఉన్న 15 మంది క్రీడాకారులకు మాత్రమే మెడల్ ఇవ్వాలని ఐసీసీ నియమం ఉంది. యువ బ్యాటర్ షెఫాలీ వర్మ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడినప్పటికీ, ఆమె ఫైనల్ జట్టులో భాగమైంది కాబట్టి మెడల్ అందుకుంది. దీనికి విరుద్ధంగా ప్రతికా రావల్ ప్రపంచ కప్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 308 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కాలికి తీవ్ర గాయం కావడంతో ఫైనల్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఈ కారణం చేత ఆమెకు మెడల్ దక్కలేదు. ప్రతికా రావల్‌కు మెడల్ దక్కని విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా జోక్యం చేసుకున్నారు. ఒక ఛానెల్‌తో మాట్లాడిన ప్రతికా రావల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. “ప్రతికాకు మెడల్ అందించడానికి తాను ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు జై షా మా మేనేజర్‌కు మెసేజ్ చేశారు” అని ఆమె తెలిపింది.జై షా జోక్యం కారణంగా ఐసీసీ తన నిబంధనను మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రతికా రావల్‌కు ఇప్పుడు విన్నింగ్ మెడల్ దక్కడం ఖాయమైంది. అంతకుముందు ప్రతికా ప్రధాని, రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆమె ధరించిన మెడల్‌ను సహాయక సిబ్బందిలోని ఒకరు ఆమెకు ఇచ్చారు. ఆ మెడల్‌ను చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయని ఆ భావోద్వేగం నిజమైనదని ఆమె పంచుకుంది. ప్రతికా రావల్ ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కానీ గాయం ఆమెను ఫైనల్‌కు దూరం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో ఆమె 122 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. మొత్తం టోర్నమెంట్‌లో ఆమె 6 ఇన్నింగ్స్‌లలో 308 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆమె కాలు తీవ్రంగా బెణికింది. దీంతో ఆమె ఫైనల్‌ను వీల్‌చైర్‌లోనే చూడాల్సి వచ్చింది. రాష్ట్రపతి, ప్రధానిని కలిసినప్పుడు కూడా ఆమె వీల్‌చైర్‌పైనే ఉంది.