‘శభాష్‌ రామ్‌ చరణ్‌!’ — మంచి నిర్ణయంతో ట్రెండింగ్‌లో మెగా హీరో

సాక్షి డిజిటల్ న్యూస్ :టాలీవుడ్‌లో హీరోలకుండే ట్యాగ్స్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా బిగినింగ్‌లోనూ ఈ ట్యాగ్స్‌ టైటిల్ రేంజ్లో పడాలనే కోరిక హీరోల నుంచి ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌కు ఎప్పుడూ వెళుతూనే ఉంటుంది. అయితే ఇలాటి ఈ పరిస్థితుల్లో తాజాగా స్టార్ హీరో రామ్‌ చరణ్‌ తన గ్లోబల్‌ స్టార్ ట్యాగ్‌ను వదిలేసినట్టుగా తెలుస్తోంది. బుచ్చి బాబు డైరెక్షన్లో తాను చేస్తున్న పెద్ది మూవీలో గ్లోబల్ స్టార్ ట్యాగ్ వద్దని స్వయంగా చరణ్‌ సూచించినట్టుగా ఓ టాక్ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అయితే గేమ్‌ ఛేంజర్ మూవీలో ఇదే ట్యాగ్‌ను చరణ్ క్యారీ చేసినప్పటికీ.. ఆ సినిమా ప్లాప్‌ అవ్వడంతో.. ఆ ట్యాగ్‌ ను వదిలేసినట్టు టాక్. అయితే ఈ న్యూస్‌ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెటిజన్లు అందరూ రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కు మన హీరోలు ఎదిగిన ఈ క్రమంలో.. మన హీరోల ట్యాగ్‌లు ఇతర భాషల్లో అడ్డుగా మారే ప్రమాదం ఉందనే కామెంట్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *